Eta Variant In India ఇప్పటికే పలు వేరియంట్లు | Kerala | COVID 19 Vaccination || Oneindia Telugu

2021-08-07 151

Karnataka's first Eta variant case found in Mangaluru. As of March 5, the Eta variant had been detected in 23 countries. The first cases were detected in December 2020 in the UK and Nigeria, and as of 15 February, it had occurred in the highest frequency in Nigeria.
#EtaVariantInIndia
#Mangaluru
#COVID19
#Nigeria
#kerala
#Covidvaccination


కరోనావైరస్ మహమ్మారికి సంబంధించి ఇప్పటికే పలు వేరియంట్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మరో కరోనా వేరియంటు వెలుగుచూసింది. కరోనావైరస్ తన జన్యు క్రమాన్ని మార్చుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను, శాస్త్రవేత్తలను ఆందోళనలకు గురిచేస్తోంది. బ్రిటన్‌లో తొలిసారి గుర్తించిన 'ఈటా'(బీ.1.525) వేరియంట్ ఇప్పుడు భారత్‌లోనూ వ్యాపిస్తోంది. కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని ఓ వ్యక్తిలో ఈటా వేరియంట్ రకాన్ని గుర్తించినట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుడు నాలుగు నెలల క్రితం దుబాయ్ నుంచి దక్షిణ కన్నడ జిల్లాలోని మూదబిద్రే గ్రామానికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. పరీక్షలు నిర్వహించగా.. ఇతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కోలుకున్నారు.